కులాల వారిగా జన గణన చేయాలి : అఖిల భారత యాదవ మహాసభ

సైదాబాద్ : జన గణన -2021లో కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలని కోరుతూ అఖిల భారత యాదవ మహసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్‌కు వినతి పత్రం అందజేశారు. తమ వినతి పత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ కుల జనాభా గణన 1931లో జరిగిందని, ఆ తర్వాత ఇప్పటి వరకు జరగలేదని అన్నారు.
తమ సంస్థ జాతీయ కార్యవర్గ అదేశాల మేరకు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రధాన మంత్రి మోడీకి వినతి పత్రాలను పంపుతున్నామని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొదట హైదరాబాద్ కార్యవర్గం తరుపున జిల్లా కలెక్టర్ శర్మన్ కలిసి వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. గ్రేటర్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ మాట్లాడుతూ మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల బీసీల డిమాండ్ మేరకు కులాల వారీగా జనాభా గణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి అమోదించినట్లుగానే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చోరవ తీసుకుని అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆయన కోరారు.
2021 జన గణన కులాల వారీగా సర్వే చేయాలని తద్వారా కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల్లో అర్హులైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఐలబోయిన రమేశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గొర్ల యశ్వంత్ యాదవ్, గ్రేటర్ యువజన అధ్యక్షుడు విజయ్‌కుమార్ యాదవ్,కోశాధికారి శ్రీశైలం యాదవ్, అక్కెం నర్సింగ్ యాదవ్, మల్లికార్జున్, కృష్ణతేజ యాదవ్, శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

