బంజారాహిల్స్, డిసెంబర్ 30: తనతోపాటు పనిచేస్తున్న మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్పై కేసు నమోదయింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నందినగర్‌కు చెందిన మహిళ(29) ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ తరపున ఓ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది.
అదే సంస్థకు చెందిన సెక్యూరిటీ సూపర్వైజర్ తిరుపతి కొంతకాలంగా ఆమెను తీవ్రస్థాయిలో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. విధులు నిర్వహిస్తున్న ప్రదేశంలో నరకం చూపిస్తుండటంతో పాటు ఇంటికి రావాలంటూ వెకిలి వేషాలు వేస్తున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు తిరుపతిపై ఐపీసీ 354(ఏ), 354(డి) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.