Hyderabad | హైదరాబాద్లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. పంజాగుట్ట నుంచి బేగంపేట వైపు వెళ్తున్న మారుతి సుజుకీ SX4 కారు (AP10 AX 8994) ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు నిలిపివేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పేశారు. దీంతో కారులో ఉన్నవాళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.