దగా పాలనపై బీఆర్ఎస్ రణభేరి
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై రెండో రోజూ గురువారం సైతం గ్రేటర్‌వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తించింది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సరార్ తీరును ఎండగడుతూ గులాబీ శ్రేణులు నియోజకవర్గాల వ్యాప్తంగా భారీ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
- రెండో రోజూ బీఆర్ఎస్ నిరసనలు
- వెయ్యి రోజుల విఫల పాలనపై సమరశంఖం
- పలు నియోజకవర్గాల్లో 22ఏ బాధితులతో సమావేశం
- తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాల అందజేత
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై రెండో రోజూ గురువారం సైతం గ్రేటర్‌వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తించింది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సరార్ తీరును ఎండగడుతూ గులాబీ శ్రేణులు నియోజకవర్గాల వ్యాప్తంగా భారీ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు 22ఏ నిషేధిత ఆస్తుల బాధితులతో సమావేశమై.. తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు, 22ఏ బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
22ఏ నిషేధిత భూముల సమస్యను రాజకీయ కోణంలో కాకుండా ప్రజల సమస్యగా చూడాలని,అర్హులైన భూ యజమా నులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కాలనీలను 22ఏ నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు బీఆర్ఎస్ ముందుండి పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం 22ఏ నిషేధిత పేరుతో ప్రజల భూములకు సంకేళ్లు ఎలా వేస్తుందని ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ మండల కార్యాలయాల వద్ద ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మాజీ ప్రజాప్రతినిధులు నిరసన తెలిపారు.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 3(నమస్తేతెలంగాణ)

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల ప్రజా వ్యతిరేక, మోసపూరిత పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు రెండో రోజు మిన్నంటాయి. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించి ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ సరార్ తీరును ఎండగడుతూ గులాబీ శ్రేణులు నియోజకవర్గాల వ్యాప్తంగా భారీ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు నియోజకవర్గాల్లో 22ఏ నిషేధిత ఆస్తుల బాధితులతో సమావేశమై.. ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వ తీరు వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ సొంత భూములు, ఆస్తులపై హకులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు మండిపడ్డారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు దాటినా ఏ ఒక వర్గానికి మేలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి హామీని నెరవేర్చే వరకు, 22ఏ బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో పోరాడుతుందని హెచ్చరించారు.
సిటీబ్యూరో, సెప్టెంబరు 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 22ఏ నిషేధిత ఆస్తుల బాధితులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22ఏ భూతాన్ని తరిమికొడుతామని తెలిపారు. 22ఏ నిషేధిత భూముల సమస్యను రాజకీయ కోణంలో కాకుండా ప్రజల సమస్యగా చూడాలని,అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో ప్రజల సమస్యను రిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కాప్రా తహసీల్ కార్యాలయం చౌరస్తా వద్ద పెద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజల ఇబ్బందులపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కాలనీలను 22 ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు బీఆర్ఎస్ ముందుండి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. కుత్బుల్లాపూర్ మండల కార్యాలయాల వద్ద ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ప్రజాప్రతినిధులు నిరసన తెలిపారు. పీర్జాదిగూడలో మాజీ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి 22ఏ బాధితులతో సమావేశమయ్యారు. అనంతరం మేడిపల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 1000 రోజుల పాలనలో మోసాలపై రెండో రోజు క్రిషాంక్ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో నిరసన చేపట్టారు. శంషాబాద్ మండలంలోని నర్కూడలో మాజీ జడ్పీటీసీ బుర్కుంట సతీశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన 1000 రోజుల మోసంసై నిరసన చేపట్టగా, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

పోలీసుల అత్యుత్సాహం..
దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 33 నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకతతో రికార్డ్ కొట్టిందని, హామీల అమలుపై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కాంగ్రెస్ గూండాలు తమపై అకారణంగా దాడిగి దిగడం తగదని మాజీ మేయర్ మేకల కావ్య హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పార్టీ పిలుపులో భాగంగా జవహర్‌నగర్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మేయర్ మేకల కావ్య, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తామని ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగడం దారుణమని మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి 1000 రోజుల అరాచక పాలనపై బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన చార్జ్‌షీట్ మీద గురువారం 22ఏకు వ్యతిరేకంగా మలక్‌పేట నియోజకవర్గ నాయకులు ధర్నాకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నాయకులను మలక్‌పేట పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మలక్‌పేట నియోజకవర్గ ఇన్చార్జి తీగల అజిత్‌రెడ్డి, మూసారాంబాగ్ డివిజన్ అధ్యక్షుడు చెల్లూరి రఘునందన్‌రెడ్డి, గౌర శశిధర్రావు, నరేశ్, అక్బర్‌బాగ్ డివిజన్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి, పాత మలక్‌పేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు బాబు సుదర్శన్, పగిళ్ల నర్సింగ్, టిన్నుసింగ్, మరో ఇద్దరిని మలక్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- 22A land issues
- BRS
- BRS Protest
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

