అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సూచన
ఎల్బీనగర్, అక్టోబర్ 30 : పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని లింగోజిగూడ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. రాబోయే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పట్టభద్రులంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారికి ఓటరు నమోదుపై బీఆర్ఎస్ శ్రేణులు అవగాహన కల్పించాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించడం ఖాయమన్నారు. విద్యావంతులైన పట్టభద్రులు రాష్ట్రంలో పరిణామాలను గమనించి.. సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేయాలన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని డివిజన్లలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి, నాయకులు తిలక్‌రావు, రాకేశ్ ఠాకూర్, శ్రీధర్, భాస్కర్ గంగపుత్ర, నర్సింహగుప్తా, జగన్నాథ్‌రెడ్డి, తోట రాజశేఖర్‌రెడ్డి, దయానంద్, శ్రీకాంత్, కుమార్, చిత్రం సాయి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

