Keesara | మార్మోగిన శివ నామస్మరణ.. కీసరగుట్టలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
కీసర గుట్ట శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు భవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Keesara | కీసర, మార్చి 6: కీసర గుట్ట శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు భవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఇదిలా ఉంటే కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మహా శివరాత్రిని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ గ్రేటర్లో ప్రత్యేక బస్సులను నడపనున్నది.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆరు రోజుల పాటు 300 ఆర్టీసీ జాతర స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. కీసరగుట్టలో కుషాయిగూడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఆర్టీసీ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు కీసరగుట్ట నుంచి నగరంలోని పలు ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సహితం సరిపడా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు. 8 నుంచి 10 వరకు సీబీఎస్, పటాన్ చెరువు నుంచి ఏడుపాయల, బీరంగుట్ట జాతరకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

