Bomb Threat | అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలుస్తామని అందులో హెచ్చరించారు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలుస్తామని అందులో హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బెదిరింపులకు పాల్పడింది న్యూయార్క్‌కి చెందిన జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిన్న మూడు విమానాలకు..
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) వచ్చే విమానాలకు బాంబు బెదిరింపుల (Bomb Threat) పరంపర కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వస్తున్న రెండు విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు విమానాలకు బెరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, పోలీసులు అలర్ట్ అయ్యారు. తనిఖీలు చేపట్టారు.
సోమవారం ఉదయం కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో వీటిని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అనతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. విమానాలను ఐసోలేషన్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సామాజిక సమస్యలను కళాత్మకంగా మలచిన కేఎల్’
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

