BMW Car | జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు (BMW Car) బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టింది. అయితే కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణనష్టం తప్పింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు (BMW Car) బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టింది. అయితే కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
కారు నంబర్ ప్లేట్ (TS09FY9990) ఆధారంగా యజమానిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు. మాలిక్ జెమ్స్ అండ్ జ్యవెలరీ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు తేల్చారు. ఇప్పటికే కారుపై రెండు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎంతమంది ఉన్నారనే విషయమై సీసీటీవీ వీడియోలను పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

