BJP Leader | మణికొండ, మార్చి 10: ప్రేమ పేరుతో నవ వధువుకు మాయమాటలు చెప్పిన బీజేపీ నాయకుడు తనతో తీసుకు వెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. లంగర్హౌస్కి చెందిన మౌనికకి అత్తాపూర్‌కి చెందిన శివరామకృష్ణతో ఏడు రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే గోల్కొండకు చెందిన గురజాల అరవింద్‌తో మౌనికకు పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే అరవింద్‌కు వివాహమై ఓ పాప ఉంది.
ప్రేమ మత్తులో ఉన్న అరవింద్ మౌనికను బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరె మైసమ్మ దేవాలయం వద్దకు పిలిచి మాయమాటలు చెప్పి ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్లిపోయాడు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన బీజేపీ నాయకుడు అరవింద్ 7 రోజుల క్రితం వివాహమైన నవవధువును ప్రేమ పేరుతో ఎత్తుకెళ్లిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై కుటుంబ సభ్యులు నార్సింగ్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకుడి నిర్వాకంపై కాలనీ వాసులు మండి పడ్డారు. అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు