KCR | ఫ్యూర్ ఖాదీ సార్‌కు ఇష్టం.. కేసీఆర్ దుస్తులన్నీ మా దుకాణంలోనే: బిజ్జ సాయిబాబా
కేసీఆర్‌ను ఎవ్వరు కలిసినా ఆత్మీయంగా మాట్లాడుతారు. నేను ఎప్పుడు వెళ్లినా ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరిగా భోజనం చేద్దామంటారు. మాకు కోఠిలోని తాజ్‌మహల్ హోటల్ ఎదురుగా 1947లో స్వదేశీ ఖాదీ వస్ర్తాలయం ఉండేది.
- శ్రీసాయి ఖాదీ వస్త్రాలయ యజమాని బిజ్జ సాయిబాబా
KCR | కేసీఆర్‌ను ఎవ్వరు కలిసినా ఆత్మీయంగా మాట్లాడుతారు. నేను ఎప్పుడు వెళ్లినా ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరిగా భోజనం చేద్దామంటారు. మాకు కోఠిలోని తాజ్‌మహల్ హోటల్ ఎదురుగా 1947లో స్వదేశీ ఖాదీ వస్ర్తాలయం ఉండేది. అప్పుడు మా నాన్న బిజ్జ మాణిక్యం ఆ వస్ర్తాలయం చూసుకునేవాడు. అప్పుడు నా వయస్సు 18 ఏండ్లు. కేసీఆర్ సార్ మా దుఖానానికి వస్తుండేవారు. నాన్నతో మాట్లాడుతూ ఖాదీల ప్రాధాన్యతపై చర్చిస్తుండేవారు. నాతోనూ మాట్లాడేవాడు.
ఆయన మొదట్నుంచి ఫ్యూర్ ఖాదీకి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. 1985లో మా నాన్న మాణిక్యం చనిపోయాక మా ఇంటికి వచ్చి కేసీఆర్ మమ్మల్ని పరామర్శించారు. అనంతరం మేం హైదర్‌గూడలో 1991 నుంచి శ్రీ సాయి ఖాదీ వస్ర్తాలయం ప్రారంభించాం. ఇప్పటికీ కేసీఆర్‌కు మేమే దుస్తులు కుట్టి ఇస్తాం. నెలకు 30 జతలకు పైగా దుస్తులు పంపిస్తుంటాం.
ఎప్పుడు తీసుకెళ్లినా అవి ధరించి చాలా బాగున్నాయంటూ ప్రశంసిస్తుంటారు. 20 ఏండ్ల క్రితం మేం కుట్టి ఇచ్చిన దుస్తులను ఇప్పటికీ జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఎలక్షన్స్ సమయంలో 150 దుస్తులు కుట్టి తీసుకెళ్లి అందించాం. ఇప్పుడు నా కొడుకు సతీశ్ కేసీఆర్ దుస్తుల బాధ్యతలు చూసుకుంటున్నాడు. సీఎంగా ఉన్న సమయంలో మా దుకాణానికి వచ్చారు. నా కొడుకు, కూతురు వివాహాలకు హాజరయ్యారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఆ పేరొక్కటి చాలు చరిత్రలో నిలిచేందుకు. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయి.
-సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ)
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Bija Sai Baba
- KCR
- KCR sir
- MLA KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

