కార్పొరేట్‌కు దీటుగా బస్తీ దవాఖానలు

- నిత్యం వంద మంది రోగులకు వైద్య చికిత్సలు
- రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
- కరోనా జాగ్రత్తలపై రోగులకు అవగాహన
- బస్తీ దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : డాక్టర్ నెహ్రా
సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 18 : కార్పొరేట్‌కు దీటుగా బస్తీ దవాఖానలలో వైద్యసేవలు అందుతుండటంతో రోజురోజుకూ ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. బస్తీల వారీగా ప్రజలకు వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటుచేసింది. ఈ బస్తీ దవాఖానలలో సాధారణ జబ్బులకు కూడా వైద్య చికిత్సతో పాటు రక్త పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ దవాఖానలలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారని, బస్తీ దవాఖానల్లో మాత్రం పైసా ఖర్చు లేకుండా వైద్యసేవలు అందిస్తుండటంతో ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
బస్తీ దవాఖానలే మేలు..
స్థానిక ప్రజలను చిన్నచిన్న జబ్బులకే పట్టిపీడిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానల దోపిడి నుంచి ప్రజలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించాలనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో బస్తీ దవాఖానలను మెరుగుపర్చారు. ఈ కోవలోనిదే హనుమాన్ టేక్డీ బస్తీ దవాఖాన. ఈ దవాఖానలో ప్రధానంగా జ్వరం, దగ్గు, జలుబు, డయాబెటీస్, హైపర్‌టెన్షన్, కార్డియాక్, ఏఎంసీ, గైనిక్ సమస్యలపై వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బస్తీ దవాఖానలకు వచ్చే రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కింగ్ కోఠి క్లస్టర్ పరిధిలోని హనుమాన్‌టేక్డీ బస్తీ దవాఖాన పరిధిలో మొత్తం 2 వేలకు పైగా జనాభా కలిగి ఉన్నారు. నిత్యం 60 నుంచి 80 మంది రోగులు దవాఖానకు ఓపీ పేషెంట్లుగా వచ్చి వైద్య చికిత్సలు పొందుతున్నారని బస్తీ దవాఖానాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నెహ్రా చెబుతున్నారు.
నిత్యం 80 మందికి పైగా వైద్య చికిత్సలు..
హనుమాన్ టేక్డీ బస్తీ దవాఖాన ఏర్పాటుతో స్థానిక ప్రజలకు వైద్య చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సిన అవసరం పోయింది. ఈ బస్తీ దవాఖాన అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు దవాఖానలో ఎంతో ఉత్సాహంగా వైద్య సేవలు పొందుతున్నారు. అత్యధికంగా షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాల్లో పనిచేసే వారు అధికంగా వస్తారని డాక్టర్ నెహ్రా తెలిపారు. దవాఖానకు వచ్చిన వారికి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అత్యవసరమైన వారికి పెద్ద దవాఖానలకు పంపించి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని డాక్టర్ నేహ్రా తెలిపారు. ప్రతి నెల ప్రారంభంలో బస్తీ దవాఖానలకు 80 నుంచి వంద మంది వరకు వస్తుంటారన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

