Balkampet Yellamma | ఉదయం 11.34 గంటలకు.. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం జరుగనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
- ఉదయం 11.34 ని॥లకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్నం
- భూమికి 10 అడుగుల దిగువన వెలసిన అమ్మవారు
Balkampet Yellamma | అమీర్పేట్, జూలై 8: కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం జరుగనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తమున వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.
అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు: తలసాని
అమ్మవారి కల్యాణోత్సవానికి తరలివచ్చే భక్తజనులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం తరపున ఏర్పాట్లు జరుగుతున్నా, స్థానికుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎమ్మెల్యే తలసాని అన్నారు. రాజకీయంగా చోటు చేసుకున్న మార్పుల ప్రభావం కల్యాణోత్సవంపై పడకుండా స్థానికులు అంతా కలిసి పని చేయాలన్నారు. పలు వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను వేడుకల ఏర్పాట్లపై ఆశించినంత మేర ప్రత్యక్ష పర్యవేక్షణ చేయలేకపోయానని, అయినా భక్తుల సేవలో బల్కంపేట వాసులంతా తమ వంతు భాగస్వామ్యాన్ని అందించేందుకు ముందుకు రావాలన్నారు.
అమ్మవారికి గద్వాల పట్టుచీర

గద్వాల రూరల్: నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి గద్వాల నేత పట్టుచీరను నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. రాష్ట్ర రాజధానిలో సోమవారం పట్టుచీరను అందజేసిన ఆలయ కమిటీ చైర్పర్సన్ గాయత్రీ సతీశ్ కుమార్ అనంతరం, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జములమ్మ ఆలయ డైరెక్టర్ ఓం ప్రకాశ్ కాంబ్లే, రంగస్వామి, తోట రాముడు, రవి పాల్గొన్నారు.
భూమికి 10 అడుగుల దిగువన..
భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు భూమి ఉపరితలానికి 10 అడుగుల దిగువన నిద్రిస్తున్న రూపంలో స్వయంభువుగా వెలసింది. ఈ ఆలయంలో అమ్మవారి మూల విగ్రహం వెనుక భాగం నుంచి నిత్యం నీటి ఊటలు ఉంటాయి. ఎటువంటి కాలంలో అయినా ఈ నీటి ఊటలు సంభవిస్తుంటాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ అమ్మవారు వెలసినట్టు చెబుతారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

