సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై బీఆర్ఎస్లోకి..
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ టి. రాజ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు సమక్షంలో పార్టీలో చేరినట్లు మంగళవారం ఆయన వెల్లడించారు.
- బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ టి.రాజ్ కుమార్
కవాడిగూడ, నవంబర్ 14: సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ టి. రాజ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు సమక్షంలో పార్టీలో చేరినట్లు మంగళవారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని ఆయన చెప్పారు. తమ చేరికకు సహకరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి అసమానమైనదని, భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండాలన్న దానిపై కేసీఆర్‌కు స్పష్టత ఉన్నదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

