హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలో(Narsinghi) మరో హిట్ అండ్ రన్ కేసు(Hit and run case) నమోదైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగు రోడ్డుపై(Outer Ring Road) రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్ట్కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
యువకుడిని ఢీ కొట్టిన ఆగకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.