సిటీబ్యూరో: ప్రతిష్టాత్మకమైన 79వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ ధరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రఖ్యాత డిజైనర్ రియా కపూర్ రూపొందించిన దుస్తులను ధరించిన ఆలియా భట్ వాటికి తోడుగా మలబార్ గోల్డ్నుంచి సిలోన్ నీలమణితో పాటు వజ్రాలతో కూడిన అత్యున్నత శ్రేణి ఆభరణాలతో జిగేల్మనిపించారు.
ఆలియా భట్ ధరించిన చెవిపోగులు, నీలమణి ఉంగరాలు, వజ్రాల పెండెంట్స్ మలబార్ గోల్డ్ నాణ్యతకు అద్దం పట్టాయి. ఆయా ఆభరణాలు సంస్థ పనితీరు, రత్నాల తయారీ, డిజైన్లను ప్రతిబింబించాయని సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు.