Zoo park | జూపార్క్‌లో కొమ్ముల గుడ్లగూబ దత్తత

చార్మినార్ : అద్భుతమైన జూ పార్క్ అందాలు మళ్లీమళ్లీ పిలిచేట్లుగా ఉన్నాయని సీని నటుడు సూర్యతేజ తెలిపారు. శుక్రవారం ఆయన పాతనగరంలోని జూ పార్క్‌ను సందర్శించారు. జూలోని ఎన్క్లోజర్లలో ఉన్న జంతువుల పరిరక్షణతో పాటు వన్యప్రాణి రక్షణ, పర్యావరణ రక్షణ కోసం జూ అధికారులు తీసుకుంటున్న కృషిని చూసి ప్రత్యేకంగా అధికారుల పనితీరును ప్రశంసించారు.
జూలో చేపడుతున్న పలు అభివృద్ది పనులతోపాటు జంతు దత్తత కార్యక్రమాల వివరాలను నటుడు సూర్యతేజకు జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ వివరించారు. ఈ సందర్భంగా సూర్యతేజ జూ పార్క్‌లోని నిశాచర ఎన్‌క్లోజర్లలోని గ్రేట్ ఇండియన్ హోర్నేడ్ ఓల్ ( కొమ్ముల గుడ్లగూబ) ను సంవత్సరం పాటు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు.

వెంటనే జూ అధికారులు దత్తత ప్రక్రియను పూర్తిచేసి వివరాలను సూర్యతేజకు అందించారు. ఈ సందర్భంగా జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ మాట్లాడుతూ జూలోని సంతువులను దత్తత తీసుకోవడానికి జంతు ప్రేమికులతోపాటు కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు, వీఐపీలు, సెలబ్రేటీలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
జంతు పరిరక్షణతోపాటు పర్యావరణ సంరక్షణలోనూ ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నటుడు సూర్యతేజ క్యూరేటర్ రాజశేఖర్‌కు గ్రేట్ ఇండియన్ హోర్నేడ్ ఓల్ దత్తతకు సంబంధించిన సంవత్సర ఖర్చులకు సంబంధించిన 20వేల రూపాయలను అందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

