కామవాంఛకు సహకరించలేదని..

పహాడీషరీఫ్, జూలై 20: చెడు అలవాట్లకు బానిసైన ఓ యువకుడు మృగంగా మారాడు. ముక్కుపచ్చలారని ఏడేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. బాలుడు సహకరించకపోవడంతో భయంతో హత్య చేశాడు. 2019, మే 8వ తేదీన బాలాపూర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదుగా శిక్షతో పాటు రూ. ఏడు వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపారు.
ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. బాలాపూర్ మండల పరిధిలోని వాదీ ఏ ముస్తఫా కాలనీకి చెందిన ఒమర్ బిన్ హసన్ (25) చెడు అలవాట్లకు బానిసై జులాయిగా తీరిగాడు. పేద కుటుంబం, ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లిదండ్రులు అతడి వివాహం చేయలేకపోయారు. గంజాయి మత్తులో ఉండే నిందితుడికి లైంగిక కోరికలు పెరగడంతో ఆ కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నించసాగాడు. ఈ క్రమంలోనే 2019, మే 8వ తేదీన రాత్రి సుమారు 9 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఏడేండ్ల బాలుడు చాక్లెట్ కొనుగోలు కోసం వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న దుకాణానికి వచ్చాడు. ఒమర్ బిన్ హసన్ ఆ బాలుడిని గమనించాడు. బాలుడి వద్దకు వెళ్లి.. మాయమాటలు చెప్పాడు. మాటల్లో పెట్టి ప్రహరీ నిర్మించి ఉన్న స్థలంలోకి తీసుకెళ్లాడు.
అక్కడ బాలుడిపై వికృత చేష్టలతో లైంగిక దాడికి దిగాడు. బాలుడు సహకరించకపోవడంతోపాటు కేకలు వేస్తూ ఏడ్చాడు. విషయం బయటకు తెలుస్తుందన్న భయంతో బాలుడి చేతులు, కాళ్లు పట్టుకొని నిందితుడు బండకు కొట్టాడు. దీంతో బాలుడి తలకు బలంగా దెబ్బ తగలడంతో మరణించాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన బాలాపూర్ అప్పటి ఇన్స్పెక్టర్ సైదులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తించి అరెస్టు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదు పడటంలో సాక్షులను ప్రవేశపెట్టిన సీఐ భాస్కర్‌ను, ప్రభుత్వం తరురఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములును వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- accused jailed
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

