పోలీస్ శాఖలోఏసీబీ కలకలం
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోని కొందరు అధికారులు విధులనే ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. కేసుల దర్యాప్తు, చార్జీ షీట్ల దాఖలు, బెయిల్, కేసుల పరిషారం వంటి అంశాలను అడ్డుపెట్టుకుని లంచాలు వసూలు చేస్తున్నారు. క్రమంలో 24 గంటల్లో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ముగ్గురు పోలీసులు ఏసీబీ చేతిలో అరెస్టు కావడం కలకలం రేపుతోంది. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న వారిలో కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ఉండటం గమనార్హం.
- దర్యాప్తు నుంచి బెయిల్ వరకు చెయ్యితడపాల్సిందే!
- 24 గంటల్లో ముగ్గురు పట్టుబడిన వైనం
- అనిశా దాడుల్లో వెలుగులోకి లంచావతారుల బాగోతాలు
- ప్రజల్లో పోలీసులపై సన్నగిల్లుతున్న విశ్వాసం
సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోని కొందరు అధికారులు విధులనే ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. కేసుల దర్యాప్తు, చార్జీ షీట్ల దాఖలు, బెయిల్, కేసుల పరిషారం వంటి అంశాలను అడ్డుపెట్టుకుని లంచాలు వసూలు చేస్తున్నారు. క్రమంలో 24 గంటల్లో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ముగ్గురు పోలీసులు ఏసీబీ చేతిలో అరెస్టు కావడం కలకలం రేపుతోంది. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న వారిలో కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ఉండటం గమనార్హం. కేసుల నుంచి బయటపడేయడం, స్టేషన్ బెయిల్ ఇప్పించడం, కేసు నమోదు చేయకుండా చూడటం, దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల చుట్టే ఈ అవినీతి ఆరోపణలు తిరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్ ఎం. కొండల్ రావు, హోంగార్డు అబిద్ అలీ అక్టోబర్ మంగళవారం రాత్రి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఫిర్యాదుదారుడి తండ్రిపై నమోదైనకేసును మూసివేయడం, బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండటం, భవిష్యత్తులో సహకారం అందించడం వంటి అంశాలకు సంబంధించి ఇన్స్పెక్టర్ రూ.6 లక్షల లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.3 లక్షల నగదును హోంగార్డు ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ అధికారులు మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్తో పాటు హోంగార్డును అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచిన విషయం తెలిసిందే.
24 గంటలు గడవక ముందే…
మీర్చౌర్ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే బంజారాహిల్స్ పిఎస్‌కు చెందిన ఎస్ఐ విజయ్ను ఏసీవీ అధికారులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. చీటింగ్ కేసులో నిందితుడికి సహాయం చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన ఘటనలో బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్ కొత్తూర్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఓ చీటింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా చూస్తానంటూ బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్ బేరసారాలకు దిగి, రూ.10లక్షల లంచం ఇస్తే అరెస్ట్ చేయకపోవడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని కేసులు నమోదు కాకుండా చూస్తానంటూ సంస్థ ప్రతినిధులను డిమాండ్ చేశాడు. ఈ కేసులో ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో బుధవారం అరెస్టు చేశారు.
టోలీచౌకిలో లంచం తీసుకుంటూ..
సెప్టెంబర్ 1న టోలికి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆర్ఎస్ఐ పండు నాయక్ రూ.10 వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయకుండా ఉండటం, కుటుంబ వివాదాన్ని పరిషరించడం, ఫిర్యాదుదారుడి పాస్ పోర్టును స్వాధీనం చేసుకోకుండా ఉండటం వంటి అంశాలకు సంబంధించి ఆర్ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు రూ.10వేల లంచం తీసుకుంటున్న ఆర్ఎస్ఐ పండునాయక్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కుటుంబ వివాదాల పరిషారం కూడా పోలీసులకు అక్రమ ఆదాయ మార్గంగా మారిందనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది.
చందానగర్‌లో..
ఆగస్టు 22న చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ బి. బాలరాజు, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర కుమార్ రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక క్రిమినల్ కేసులో దర్యాప్తు నిర్వహించడం, చార్జిషీట్ దాఖలు చేయడం వంటి అంశాలకు సంబంధించి ఇద్దరూ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో ఎస్ఐ రూ.20 వేలు నగదు రూపం, కానిస్టేబుల్ రూ.10 వేలు యూపీఐ ద్వారా తీసుకున్నట్లు కూడా ఏసీబీ గుర్తించింది. దీంతో మొత్తం లంచం రూ.1.05 లక్షలకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. కేసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు వంటి చట్టపరమైన విధులకు కూడా కొందరు పోలీసు అధికారులు డబ్బులు డిమాండ్ చేయడం పోలీసు వ్యవస్థలోని బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేస్తోంది.
సన్నగిల్లుతున్న విశ్వాసం…?
పోలీసు శాఖ ప్రజలకు న్యాయం అందించే మొదటి ద్వారం. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు తమ సమస్య పరిషారమవుతుందనే నమ్మకం ఉండాలి. కానీ కేసు నమోదు చేయించుకోవడానికి, దర్యాప్తు చేయించుకోవడానికి, బెయిల్ పొందడానికి డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే భావన ప్రజల్లో ఏర్పడితే పోలీసు వ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుంది. ఏసీబీకి పట్టుబడిన అధికారులు వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదురొంటున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం వ్యవస్థలోని లోపాలను కూడా పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. పోలీసు శాఖలో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కూడా ఉన్నప్పటికీ, కొందరి అవినీతి ఆరోపణల కారణంగా మొత్తం శాఖ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండాలంటే అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.
భారీ లంచం డిమాండ్lకేసు నమోదు చేయకుండా ఉండేందుకు లంచం …ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలా వద్దా అనే అంశాన్ని డబ్బుతో ముడిపెట్టడం ప్రజలకు న్యాయం అందించే వ్యవస్థను బలహీనపరుస్తుంది.
బెయిల్ , దర్యాప్తు అంశాల్లో అక్రమ వసూళ్లు….స్టేషన్ బెయిల్ , దర్యాప్తు, చార్జిషీట్ వంటి అంశాలను అడ్డుపెట్టుకుని లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఆరోపణలు…కానిస్టేబుల్, హోంగార్డు, ఎస్ఐ, ఇన్స్పెక్టర్ స్థాయిల్లో అధికారులు ఏసీబీ కేసుల్లో చికుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కేసుల్లో పై అధికారుల సూచనల మేరకు కింది సిబ్బంది డబ్బులు తీసుకుంటూ బలవుతున్నారనే ఆరోపణలు పోలీసుశాఖలో కలకం రేపుతున్నాయి.
కుటుంబ తగాదాలు, భూ సెటిల్మెంట్లలోనూ కొందరు అధికారులు తమ అవినీతి ప్రతాపం చూపుతున్నారు.
కీసరలో రూ.5 లక్షల లంచం తీసుకుంటూ..
కీసర ఎస్హెచ్ఒ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్లు లంచం తీసుకుంటుండగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 16న కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ ద్యాపా జ్ఞానేందర్ రెడ్డి రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ కేసులో కీసర ఇన్ స్పెక్టర్ అరపల్లి అంజనేయులు సూచనల మేరకు ఎస్ఐ లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఒక కేసులో ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడం, వేధింపులు లేకుండా చూడడం వంటి అంశాలకు సంబంధించి ఈ మొత్తం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో పోలీస్ స్టేషన్ స్థాయిలోనే కాకుండా పైస్థాయి అధికారుల పాత్రపై కూడా ఆరోపణలు రావడం అప్పట్లో కలకలం రేపింది. ఇదిలా ఉండగా ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడటంతో స్థానిక ప్రజలు కీసర పోలీస్ స్టేషన్ ఎదుట సంబరాలు చేసుకోవడం, పోలీసులపై ప్రజల్లో ఎంతటి అసంతృప్తి పేరుకుపోయిందో తెలియజేస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

