Traffic constable | ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై యువకుడి దాడి.. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎల్బీనగర్, నవంబర్ 30 : ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కంటికి గాయమయ్యింది. సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి కథనం ప్రకారం ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అప్పారావు నవంబర్ 26వ తేదీన కొత్తపేట చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన భరత్ అనే యువకుడిని అప్పారావు ఆపి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నావంటూ చాలాన్ విధించాడు.
దీంతో ఇరువురి మద్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయిన భరత్ మరో 15 నిమిషాల తర్వాత మరలా వచ్చి ఓ రాయితో కానిస్టేబుల్ అప్పారావుపై దాడి చేశాడు. ఈ ఘటనలో అప్పారావు కంటికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే తోటి పోలీస్ సిబ్బందితో పాటుగా స్థానికులు కానిస్టేబుల్ అప్పారావును సమీపంలోని ఓమ్ని హాస్పిటల్లో చేర్పించారు. అక్కడే ఉన్న స్థానికులు, పోలీస్ సిబ్బంది భరత్‌ను పట్టుకుని సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

