Rangareddy | మైలార్‌దేవ్‌పల్లిలో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. సెక్యూరిటీ గార్డ్ హత్య
Rangareddy | మైలార్‌దేవ్‌పల్లిలో మంగళవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలను అడ్డుకునేందుకు వచ్చిన సెక్యూరిటీగార్డును దారుణంగా హత్య చేశారు.
Rangareddy | రంగారెడ్డి : మైలార్‌దేవ్‌పల్లిలో మంగళవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలను అడ్డుకునేందుకు వచ్చిన సెక్యూరిటీగార్డును దారుణంగా హత్య చేశారు.
ఆరాంఘర్ చౌరస్తాలోని ఓ పరిశ్రమలో దొంగతనం చేసేందుకు మంగళవారం అర్ధరాత్రి దొంగలు వచ్చారు. దొంగలను గమనించిన సెక్యూరిటీ గార్డు ఆసిఫ్ వారిని అడ్డుకునేందుకు యత్నించాడు. కానీ దొంగలు ఆసిఫ్‌పై దాడి చేసి చంపారు. అనంతరం గోడౌన్‌లోని విలువైన ఐరన్ రాడ్స్‌తో పాటు ఆరు సీసీకెమెరాలను అపహరించారు.
ఆసిఫ్ హత్యకు గురైనట్లు గోడౌన్ యజమానికి సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న యజమాని ఆసిఫ్ మృతదేహాన్ని చూసి భయంతో వణికిపోయాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. ఆరాంఘర్ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

