జోరుగా ఇండ్ల విక్రయాలు
హైదరాబాద్ మహానగరంలో 2023 సంవత్సరంలో నెలవారి ఇండ్ల విక్రయాలు గతేడాదితో పోల్చుకుంటే మెరుగైన వృద్ధి రేటు నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
- హైదరాబాద్‌లో.. నెలవారి ఇండ్ల విక్రయాల్లో మెరుగైన వృద్ధి
- నవంబర్‌లో రూ.3741 కోట్ల విలువ చేసే స్థిరాస్తుల విక్రయం
- గతేడాదికంటే 12 శాతం అధికం
- నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడి
సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరంలో 2023 సంవత్సరంలో నెలవారి ఇండ్ల విక్రయాలు గతేడాదితో పోల్చుకుంటే మెరుగైన వృద్ధి రేటు నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2022లో జనవరి నుంచి నవంబర్ నాటికి మొత్తం 11నెలల్లో అంతకు ముందు ఏడాదితో పోల్చితే (-9 శాతం)లోటు వృద్ధి రేటు నమోదు కాగా, 2023 జనవరి నుంచి నవంబర్ నాటికి 11నెలల్లో నమోదైన వృద్ధి రేటు 2022 ఏడాది కంటే 12శాతంగా అధికంగా ఉన్నదని వెల్లడించింది.
ఈ ఏడాది (2023) నవంబర్ నెలలో మొత్తం 6268 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కాగా, వాటి మొత్తం రిజస్ట్రేషన్ విలువ రూ.3741 కోట్లుగా ఉన్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వివరించింది. ఇందులో రూ.25లక్షల నుంచి 50 లక్షల విలువ చేసే ఆస్తులు 48శాతం ఉండగా, రూ.50 -75 లక్షల విలువ చేసే ఆస్తుల విలువ 17శాతం, రూ.75 లక్షల నుంచి రూ.1కోటి విలువ చేసే ఆస్తులు 9 శాతం, రూ.కోటి నుంచి 2 కోట్ల విలువ చేసే ఆస్తుల విలువ 10 శాతం, రూ.2 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తులు 3 శాతంగా 2023లో నమోదైందని పేర్కొన్నారు.



Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

