హైదరాబాద్ : ఓ వృద్ధురాలి(Old woman) మెడలోంచి నాలుగు తులాల బంగారు గొలుసును(Gold chain )దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన చిలకలగూడలో(Chilakalaguda) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ దుండగుడు గోడ దూకి సదరు వృద్ధురాలి ఇంట్లో చొరబడ్డాడు. వృద్దురాలిని బెదిరించి బంగారు గొలుసుతో పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.