Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో భారీ నగదు పట్టుబడింది. ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ. 6.5 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో నగదు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడ్డ నగదు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.