ఆటల్లో రాణించేలా.. పతకాలు పట్టేలా
గ్రేటర్లో క్రీడల ప్రోత్సాహానికి జీహెచ్ఎంసీ అవసరమైన చర్యలు చేపడుతున్నది. ఖర్చుకు వెనుకాడకుండా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే నేపథ్యంలో క్రీడా మైదానాల ఆధునీకరణ, మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టి విడతల వారీగా అందుబాటులోకి
- గ్రేటర్లో మరో మూడు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు
- వచ్చే నెలాఖరులో ప్రారంభానికి సన్నాహాలు
- ఇప్పటికే రూ.40.16కోట్లతో ఎనిమిది అందుబాటులోకి..
- టెండర్ దశలో ఐదు చోట్ల పనులు
- క్రీడల అభివృద్ధికి బల్దియా విశేష కృషి
- పతకాలు సాధించేలా ప్రత్యేక శిక్షణ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో క్రీడల ప్రోత్సాహానికి జీహెచ్ఎంసీ అవసరమైన చర్యలు చేపడుతున్నది. ఖర్చుకు వెనుకాడకుండా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే నేపథ్యంలో క్రీడా మైదానాల ఆధునీకరణ, మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టి విడతల వారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. 854 క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణ, ఆధునీకరణ అవసరమైన చోట నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను అందుబాటులోకి తెచ్చేందుకుగాను రూ.86.61 కోట్ల అంచనా వ్యయంతో 18 క్రీడా మైదానాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.40.16కోట్ల వ్యయంతో 8 చోట్ల క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆధునిక, సంప్రదాయ క్రీడల్లో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు కోచ్‌లను కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. వీరిని జిల్లా, రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించే స్థాయి వరకు జీహెచ్ఎంసీ తోడ్పాటు అందిస్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే నెలాఖరులోగా మూడు చోట్ల క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు కొనసాగుతున్నాయని, ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్ జోన్ పరిధిలో రూ.11.99 కోట్లతో మూడు చోట్ల పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులో మరో మూడు చోట్ల పనులకు ఇటీవల పరిపాలన అనుమతులు లభించాయని, రూ.5.10కోట్లతో పనులకు టెండర్లను ఆహ్వానిస్తామని అధికారులు పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల వివరాలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 18 చోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఆడిటోరియంలు, ఇండోర్ స్టేడియంలు, ప్లే గ్రౌండ్స్‌లకు శ్రీకారం చుట్టారు.
- రూ.40.16కోట్లతో 8చోట్ల పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.
- రూ.8.97 కోట్లతో మూడు చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
- పలు కారణాలతో రెండు చోట్ల రూ.20.39కోట్ల అంచనాతో చేపట్టాల్సిన పనులను రద్దు చేశారు.
- రూ. 11.99కోట్లతో రెండు చోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు ఇటీవల టెండర్లను ఆహ్వానించారు.
- రూ.5.10కోట్లతో మూడు చోట్ల ఆడిటోరియంలు, ప్లే గ్రౌండ్స్‌లకు పరిపాలన అనుమతులు లభించారు. త్వరలోనే వీటికి టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

