కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఏం దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్
హెచ్డీఎఫ్సీ ఏటీఏం | కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఏం దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్

హైదరాబాద్ : కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఏం దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 29వ తేదీన మిట్ట మధ్యాహ్నం ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి రూ. 5 లక్షల నగదుతో ఉడాయించిన సంగతి తెలిసిందే. నిందితుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
నిందితులు బీహార్ వాసులైన అజిత్ కుమార్, ముఖేష్ కుమార్ అని సీపీ తెలిపారు. ఇద్దరు నిందితుల నుంచి రూ. 6.31 లక్షలు, మూడు సెల్ఫోన్లు, నాటు తుపాకీతో పాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏటీఎం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అజిత్ కుమార్ అని సీపీ పేర్కొన్నారు. అజిత్ కుమార్ ఉపాధి నిమిత్తం 2011లో దుండిగల్‌కు వచ్చాడు. తొలుత కార్మికుడిగా, ఆ తర్వాత కాంట్రాక్టర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిపై దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
2018లో దుండిగల్‌లో మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయంలో దోపిడీకి యత్నించి విఫలమయ్యాడు. పారిపోయే ప్రయత్నంలో పట్టుబడి అజిత్ జైలు పాలయ్యాడు. జైలు నుంచి వచ్చాక బీహార్ వెళ్లి.. రెండేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు. గండి మైసమ్మ వద్ద ఓ ప్యాకేజింగ్ పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. స్నేహితుడు ముకేశ్ సాయంతో మళ్లీ నేరాలు చేసేందుకు కుట్ర చేశాడు.
ఈ క్రమంలో తుపాకీ కొనేందుకు ముకేశ్‌కు అజిత్ రూ. 30 వేలు పంపాడు. తుపాకీ, తూటాలు సమకూర్చిన ముకేశ్ సాయంతో అజిత్ దోపిడీలు చేశాడు. ఏప్రిల్ 16న మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయంలో రూ. 1.15 లక్షలు దోపిడీ చేశారు. ఏప్రిల్ 24న దుండిగల్‌లో బైక్ చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత ఏప్రిల్ 29న కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద చోరీ చేసినట్లు సజ్జనార్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

