TSRTC | దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన రెండు బస్సులు
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది.
హైదరాబాద్: హైదరాబాద్ దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది. క్రమంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకున్నాయి. దీంతో చూస్తుండగానే రెండు బస్సులు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
అయితే ప్రమాదానికి గల కారాణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉండటం, మంటలు రెండు బస్సులకు పరిమితం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బస్సులో షాక్ సర్క్యూట్ అవడం వల్లే మంటలు చెలరేగాయిన డిపో అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

