RS Praveen kumar | కాంగ్రెస్ పాలనలో 127 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen kumar | ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని గడ్డి మందు తాగితే కనీసం ఆ అమ్మాయిని ఆసుపత్రికి కూడా తీసుకుపోలేదని.. రెండు రోజుల తర్వాత ఆసుపత్రికి తీసుకుపోతే.. అప్పటికే ఆ అమ్మాయి కిడ్నీలు, ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి ప్రాణాలు విడిచిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
RS Praveen kumar | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే.. ఈ రోజు కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు శవాలై ఇంటికి వెళ్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గద్వాల జిల్లా అయిజ మండలంలో నిరీక్షణ, ప్రసన్న అనే అమ్మాయిలకు చిన్నతనంలోనే బాల్యవివాహాలు చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు. ఇద్దరిలో నిరీక్షణ అనే అమ్మాయి తల్లిదండ్రులను ఎదురించి ఢిల్లీ యూనివర్సిటీలో, హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదివింది. ఇక ప్రసన్న అనే అమ్మాయి ఢిల్లీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు అమెరికాకు 5 సంవత్సరాల కోర్సుకు వెళ్లిందన్నారు.
ఈ ఇద్దరు నా దగ్గరికి వచ్చి మీ కృషి వల్ల, కేసీఆర్ ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి ఎదిగామని అంటుంటే ఎంతో సంతోషంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని గడ్డి మందు తాగితే కనీసం ఆ అమ్మాయిని ఆసుపత్రికి కూడా తీసుకుపోలేదని.. రెండు రోజుల తర్వాత ఆసుపత్రికి తీసుకుపోతే.. అప్పటికే ఆ అమ్మాయి కిడ్నీలు, ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి ప్రాణాలు విడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇప్పటివరకు 127 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తే.. ఈరోజు కాంగ్రెస్ పాలనలో శవాలై ఇంటికి వెళ్తున్నారు
గద్వాల జిల్లా అయిజ మండలంలో నిరీక్షణ, ప్రసన్న అనే అమ్మాయిలకు చిన్నతనంలోనే బాల్యవివాహాలు చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు
తల్లిదండ్రులను ఎదురించి నిరీక్షణ… https://t.co/EhryAmrQK8 pic.twitter.com/nWSeEPfjQe
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

