12కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య
బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి
బోడుప్పల్, మార్చి17: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి రూ.50లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామగ్రి కొనుగోలుకు రూ.3లక్షలు , రా చెరువు అభివృద్ధి, నాలా నిర్మాణం పొడిగింపునకు మరో రూ.4కోట్లు కేటాయించేందుకు కౌన్సిల్లో సభ్యులు ఆమోదించారు. పది బస్‌స్టాప్‌ల నిర్మాణం, బోడుప్పల్ నగరానికి 7 ముఖద్వారాల నిర్మాణానికి సభ ఆమోదం లభించింది. నగరంలోని పలు సర్వే నంబర్లు ఇండస్ట్రీయల్ జోన్లో ఉన్నాయని, వాటిని రెసిడెన్షియల్ జోన్లుగా మార్చడానికి సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపడానికి తీర్మానించినట్లు పేర్కొన్నారు. 2022 హరితహారానికి రూ.5.93కోట్లు, పరిశుభ్రత, శానిటేషన్‌లో సామగ్రి కొనుగోలుకు రూ.73.5 లక్షలు కేటాయింపునకు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

