Hyderabad | సెప్టెంబర్ 2న ‘డబుల్’ పండుగ.. ఒకే రోజు 11,700 మంది లబ్ధిదారులకు సొంతింటి కల సాకారం
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు కానుకగా అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఆ మహా క్రతువును వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేలాది ఇళ్లను నిరుపేదలకు అందించింది ప్రభుత్వం. నిర్మాణాలు పూర్తి చేసుకున్న 70 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
Hyderabad | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు కానుకగా అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఆ మహా క్రతువును వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేలాది ఇళ్లను నిరుపేదలకు అందించింది ప్రభుత్వం. నిర్మాణాలు పూర్తి చేసుకున్న 70 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా శనివారం ఒకే ఒక్కరోజు ఏకంగా 11,700 డబుల్ బెడ్రూం ఇళ్లను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన దరిమిలా వారికి ఇళ్లను పంపిణీ చేసేందుకుగాను జీహెచ్ఎంసీ పరిధిలో తొమ్మిది ప్రాంతాలను వేదికగా ఏర్పాటు చేశారు. ఏడుగురు రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ స్పీకర్, జీహెచ్ఎంసీ మేయర్.. ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన 11,700 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేయనున్నారు.
నియోజకవర్గాల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్ల వివరాలివే..
- కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో 1700 గృహాలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పంపిణీ చేస్తారు. గాజుల రామారం (144), బహదూర్‌పల్లి (356), డి-పోచంపల్లిల్లో 1700 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. గాజుల రామారం (144), బహదూర్‌పల్లి (356) ఇళ్లను కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. డి-పోచంపల్లిలో నిర్మించిన 1200 గృహాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 200 మంది, సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 500 మంది, కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
- చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ సర్వేనెంబరు 82, 83/పి భూమిలో నిర్మించిన 270 గృహాలు, బహదూర్‌పుర నియోజకవర్గం ఫారూక్‌నగర్‌లో నిర్మించిన 770 గృహాలు… మొత్తం 1040 ఇళ్లను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పంపిణీ చేస్తారు. బండ్లగూడ పరిధిలో నిర్మించిన ఇళ్లను చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు పంపిణీ చేయనుండగా… ఫారూక్‌నగర్‌లో నిర్మించిన ఇళ్లను బహదూర్‌పుర నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
- రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నిర్మించిన 356 డబుల్ బెడ్రూం ఇళ్లను రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పంపిణీ చేయనున్నారు. నార్సింగి, బైరాగిగూడ-2 ప్రాంతంలో నిర్మించిన 160 ఇళ్లు, నార్సింగి సర్వేనెంబరు 117లో నిర్మించిన 196 గృహాలను రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.
- శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల సర్వేనెంబరు 125లో నిర్మించిన 216 గృహాలు, సాయినగర్ హఫీజ్‌పేట్‌కు చెందిన 168 ఇళ్లను రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పంపిణీ చేయనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని గృహాలను శేరిలింగంపల్లి పరిధిలోని లబ్ధిదారులకు అందజేయనున్నారు.
- పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-1, అమీన్పూర్-2లో నిర్మించిన 3,300 గృహాలను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పంపిణీ చేయనున్నారు. కొల్లూరు-1లోని 1500 గృహాలను ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 200 మంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 156 మంది, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన 144 మంది, పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన 500 మందికి పంపిణీ చేస్తారు. అదేవిధంగా అమీన్పూర్-2లో నిర్మించిన 1800 గృహాలను గోషామహల్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, నాంపల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది, కార్వాన్కు చెందిన 500 మంది, ఖైరతాబాద్‌కు చెందిన 300 మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.
- మేడ్చల్ నియోజకవర్గంలోని అహ్మద్‌గూడలో నిర్మించిన 1500 గృహాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేయనున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన 500 మంది, ముషీరాబాద్‌కు చెందిన 500 మంది, సికింద్రాబాద్‌కు చెందిన 500 మంది లబ్ధిదారులకు ఈ గృహాలను పంపిణీ చేయనున్నారు.
- ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీనగర్‌కాలనీ (సర్వేనెంబరు 710/పి)లో నిర్మించిన 500 గృహాలను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ పంపిణీ చేయనున్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఈ గృహాలను అందజేయనున్నారు.
- మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతాప్సింగారంలో నిర్మించిన వెయ్యి గృహాలను శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు పంపిణీ చేయనున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన 500 మంది, అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన మరో 500 మంది లబ్ధిదారులకు ఈ గృహాలను అందజేయనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

