బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం
బడంగ్‌పేట మున్సిపాలిటీలో అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే సుమారు రూ. 122 కోట్ల పనుల్లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 10 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీలోకి బడంగ్‌పేట మున్పిపాలిటీ విలీనానికి ముందు జరిగిన వివిధ నిర్వహణ పనుల్లో రికార్డుల తారుమారు, కమీషన్ల పంపకాలపై లోతైన విచారణ జరపాలని ఓ కాంట్రాక్టర్ బంధువు ఇంట్లో దాదాపు 46 కీలక ఫైళ్లు ప్రత్యక్షం కావడంపై కమిషనర్ సీరియస్‌గా తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశించారు.
- ఐదు లక్షల్లోపు పనుల్లో అవినీతి
- 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
- కాంగ్రెస్ నేతలతో కలిసి అధికారులపై ఒత్తిళ్లు
- బిల్లులు మంజూరు చేయాలంటూ వేధింపులు
- తనిఖీలతో అడ్డదార్లు తొక్కుతున్న కాంట్రాక్టర్లు
సిటీబ్యూరో, అక్టోబరు 13 (నమస్తే తెలంగాణ) : బడంగ్‌పేట మున్సిపాలిటీలో అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే సుమారు రూ. 122 కోట్ల పనుల్లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 10 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీలోకి బడంగ్‌పేట మున్పిపాలిటీ విలీనానికి ముందు జరిగిన వివిధ నిర్వహణ పనుల్లో రికార్డుల తారుమారు, కమీషన్ల పంపకాలపై లోతైన విచారణ జరపాలని ఓ కాంట్రాక్టర్ బంధువు ఇంట్లో దాదాపు 46 కీలక ఫైళ్లు ప్రత్యక్షం కావడంపై కమిషనర్ సీరియస్‌గా తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఇందులో భాగంగానే పాత ఫైళ్ల బిల్లుల అంశంతో పాటు కొత్తగా చేపట్టే పనుల బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఈఆర్పీ, వర్ మానిటరింగ్ సిస్టమ్ (డబ్ల్యూఎంఎస్) ద్వారా మాత్రమే బిల్లుల ఆమోదం జరగాలని స్పష్టం చేస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇకపై ప్రతి పైసా చెల్లింపునకు జోనల్ కమిషనర్లు, ఆడిట్ అధికారులే పూర్తి జవాబుదారీగా ఉంటారని చెబుతూనే పాత బిల్లుల చెల్లింపు విషయంలో క్షేత్రస్థాయిలో పని తాలుకా సమగ్ర విచారణ చేపట్టాకే బిల్లులు మంజూరు చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
బడంగ్‌పేటలో దాదాపు 610 ఫైళ్లకు బడ్జెట్ ఆమోదం పొందగా..360 ఫైళ్లకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. ఐతే 250 ఫైళ్లు తాలుకా వివరాలు ఆరా తీసిన ఇంజినీర్లకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ ఐదు లక్షల లోపు పనులు ఉండడం, గతంలో లక్ష లోపు వర్క్ల్లోనే అడ్డగోలు అక్రమాలు జరగడంతో అధికారులు, ఈ నేపథ్యంలోనే క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు సైట్ విజిట్ చేసి బిల్లుల మంజూరు చేస్తామని ఇంజినీర్లు, సంబంధిత అకౌంట్ విభాగం సిద్ధంగా ఉంటే వాటి జాడ కనబడకపోవడం హాట్ టాఫిక్‌గా మారింది. పనులు క్షేత్రస్థాయిలో పూర్తయ్యాయా? లేదా అనే అంశంపై అధికారులు తప్పనిసరిగా సైట్ విజిట్ చేయాలని సంబంధిత ఇంజినీర్లు చెబుతున్నప్పటికీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడం గమనార్హం.
బిల్లులు చెల్లించాలంటూ ఒత్తిళ్లు?
బడంగ్‌పేట మున్సిపాలిటీలో ఇప్పటికే నిధుల దుర్వినియోగం, విజిలెన్స్ విచారణలతో అలజడి నెలకొన్న నేపథ్యంలో ఐదు లక్షల లోపు ఉన్న ఫైళ్లు విస్తృత చర్చకు దారి తీసింది. గతంలో జరిగిన నిధుల మళ్లింపు, పనుల కేటాయింపులో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే ఈ ఫైళ్లను విచారణకు రాకుండా గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్ల బృందం అధికారులపై ఒత్తిళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులపై వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు దిగినట్లు తెలుస్తోంది.. పారిశుధ్యం, నిర్వహణ పనుల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అడ్డగోలుగా కాజేసేందుకే ఈ దస్త్రాలను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వర్ మేనేజ్ మెంట్ సిస్టమ్(డబ్ల్యూఎమ్ఎస్) చేసే ముందు ప్రాజెక్ట్ చేపట్టిన స్థలాన్ని (సైట్) సంబంధిత అసిస్టెంట్ ఇంజినీర్ , ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ , సూపరింటెండింగ్ ఇంజినీర్ జోనల్ కమిషనర్ స్వయంగా సందర్శన తర్వాతనే బిల్లులు చెల్లింపులు జరుపుతున్నామని, ఐదు లక్షల లోపు పనుల విషయంలోను పారదర్శకంగా వ్యవహరిస్తామని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

