ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరిగినప్పటికీ, శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం. సమయానికి తగిన నిర్ణయాలను తీసుకుంటారు.
వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు. ఉన్నత విద్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. ఓపికతో పనులు పూర్తిచేయడం అవసరం. భూముల విషయంలో తగాదాలు ముందుకు రావచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
పిల్లల చదువు విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. వృథా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల వారం. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా, సంతృప్తి పొందుతారు.
అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులలో జాప్యం జరగవచ్చు. ఓపిక అవసరం. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూముల విషయంలో కలిసివస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది.
సమాజంలో గుర్తింపు పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి.
కోర్టు పనులు కలిసివస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భూముల కొనుగోలులో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం. కొత్త వస్తువులు కొంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. పనిభారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో పదోన్నతి, స్థాన చలన సూచన. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచి సమయం. అయితే, భారీ పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసివస్తాయి. విద్యార్థులు చదువులో రాణించి మంచి సంస్థలలో చేరుతారు. వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి.
ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి మూలంగా స్థానచలన సూచన. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారుల రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు. ఆదాయమార్గాలపై దృష్టి నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో విజయం సాధిస్తారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనులలో బరువు, బాధ్యతలు పెరగవచ్చును. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో గౌరవంగా ఉంటూ, తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలను పొందుతారు. సంతృప్తిగా ఉంటారు.
తలపెట్టిన ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దైవదర్శనాలు, విహార యాత్రలకు వెళ్లవచ్చు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. రాజకీయంగా అనుకూల వారం. ప్రభుత్వ పరమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి.
– గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in