ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకుంటారు. పిల్లల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. పనిచేసే విధానంలో మార్పు వల్ల ప్రయోజనం పొందుతారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల సహకారంతో బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. నలుగురితో కలిసి పనిచేస్తారు. వ్యాపారులకు అనుకూలమైన సమయం. రాబడి పెరిగినప్పటికీ, అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. రుణ బాధలు కొంతవరకు తీరుతాయి. భూ వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు.
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భూ వ్యవహారం కలిసివస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో లాభాలు పొందుతారు. ప్రభుత్వ పనుల్లో ఆలస్యం జరగవచ్చు. బంధువులతో గతంలో ఏర్పడిన భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. మీ తెలివితేటలతో అందరినీ మెప్పిస్తారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పనుల్లో అదృష్టం కలిసివస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు ముందుకుసాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యంపై దృష్టిసారించండి. సొంత నిర్ణయాల కన్నా, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.
విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. ఆరోగ్యం కుదుటపడుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య మనస్పర్ధలు రావచ్చు. ఉల్లాసంగా పనులు చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. శ్రమ పెరిగినప్పటికీ, అందుకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. ఇంటి మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త పనులు ప్రారంభించడం కన్నా, చేతిలో ఉన్న పనులు పూర్తిచేయడంపై దృష్టి సారించండి. ప్రభుత్వ పనులు త్వరగా నెరవేరుతాయి.
కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచిస్తారు. భాగస్వాములతో కలిసి వాటిని సమర్థంగా అమలుచేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహాలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు. ఈ వారంలో తలపెట్టిన పనులు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. బంధువులతో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి.
ఖర్చులు అధికం అవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. స్వల్ప అనారోగ్య సూచన. సమయపాలన పాటించడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్నేహితులతో వృథా చర్చలకు దూరంగా ఉండండి. చేసేపనిలో సంతృప్తి ఉన్నప్పటికీ, ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం ఉండదు. సమయస్ఫూర్తితో ముందడుగు వేయండి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అవసరం. బంధుమిత్రుల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి.
రోజువారీ కార్యకలాపాలు సంతృప్తిగా కొనసాగుతాయి. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం. ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త పరిచయాల వల్ల కార్య సాఫల్యం ఉంది. భూ లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
అలసట లేకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. బాధ్యతలను సంయమనంతో నిర్వర్తిస్తారు. స్థిరాస్తి మూలంగా రాబడి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వృథా ఖర్చులు ఉండవచ్చు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త పెట్టుబడులకు సమయం కాదు.
బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. పిల్లల చదువులకు అనుకూలం. ఓపికతో సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం అవుతుంది. రుణదాతల ఒత్తిడి ఉంటుంది. వారాంతంలో పరిస్థితి సద్దుమణుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
నిరుద్యోగులకు అనుకూలం. బంధుమిత్రుల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. వ్యాపారం వేగం పుంజుకుంటుంది. కొత్త వ్యాపారంపై దృష్టి సారిస్తారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు. భూ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నలుగురిలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. పాత సమస్యలు తీరడంతో ఊరట పొందుతారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టండి.
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సొంత ఆలోచనలు అమలుచేసి విజయం సాధిస్తారు. పెట్టుబడులకు తగిన ప్రతిఫలాలు పొందుతారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు లాభదాయకం. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.