అదనంగా ఆదాయం కలుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. చాలా రోజులుగా కార్యరూపం దాల్చని పనుల్లో కదలిక వస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త పెట్టుబడులపై మనసు నిలుపుతారు. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. కార్య సాఫల్యం ఉంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనులను చాకచక్యంతో నిర్వర్తిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది.
శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. పనులు నెరవేరుతాయి. ఉద్యోగుల పనితనానికి గుర్తింపు లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. రుణాలు తీరుస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. నిర్మాణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి.
ఉద్యోగంలో పదోన్నతి అవకాశం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ పనులు లాభసాటిగా ఉంటాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సమయస్ఫూర్తితో పనులు పూర్తిచేస్తారు. బాకీలు వసూలు చేస్తారు. కొన్ని పనులలో శ్రమ ఎక్కువ అవుతుంది. అంతిమ ఫలితం అనుకూలంగా ఉంటుంది. బంధువుల సహకారంతో పనులు పూర్తవుతాయి. విద్యార్థులు చదువుపై మనసు నిలుపుతారు. మంచి ఫలితాలు సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఇల్లు, వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. గౌరవంగా ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. దూర దృష్టితో అడుగులు వేస్తారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెంచుకుంటారు. వారం మధ్యలో పనుల్లో జాప్యం జరగవచ్చు. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.
ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక సాఫల్యం ఉంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి. పెద్దల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. సంయమనంతో ఉండటం అవసరం. శుభకార్యాల కోసం ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ పనులలో విజయం చేకూరుతుంది. అన్నదమ్ములతో గతంలో కన్నా సంబంధాలు మెరుగవుతాయి. దూర ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది.
డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతుంది. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూ లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలు సాధిస్తారు. పెద్దల సహకారం అందుతుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది.
తీర్థయాత్రలకు వెళతారు. తలపెట్టిన పనుల్లో కొంత ఆలస్యం ఉండవచ్చు. పనిభారం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఆశిస్తారు. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అన్నదమ్ములతో విభేదాలు పొడచూపవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త అవకాశాలపై మనసు నిలుపుతారు. వ్యాపారులకు అనుకున్నంత రాబడి ఉండకపోవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. స్థిరమైన నిర్ణయాలను తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాజకీయ పనుల్లో జాప్యం ఉంటుంది.
సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువర్గం మూలంగా ఇబ్బందులు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండి, పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. ప్రయాణాలు కలిసివస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులలో విజయం చేకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృథా చర్చలను పక్కన పెట్టి, పనులపై మనసు నిలుపుతారు.
పనుల్లో కదలిక ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తులు అవుతారు. నూతన ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి.
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భూ వ్యవహారం లాభిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఆత్మీయుల సహకారం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. నిర్విరామ కృషితో సత్ఫలితాలు సాధిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. విహారయాత్రలపై మనసు నిలుపుతారు. పెద్దల సహకారంతో పనులు నెరవేరుతాయి.
ఇంట్లోవాళ్లతో అన్ని విషయాలను చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరుగుతుంది. అన్నదమ్ములతో సఖ్యతగా ఉండండి. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ అధికం అవుతుంది. ఆస్తి పంపకాల వ్యవహారం కొలిక్కి వస్తుంది. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అన్ని విధాలుగా సంతృప్తిగా ఉంటారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. పదోన్నతి, స్థానచలనం అవకాశాలు ఉన్నాయి. ఆస్తి మూలంగా డబ్బు వస్తుంది. బంధువులు, అన్నదమ్ములతో పనులు నెరవేరినా, వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. విహారయాత్రలు చేపడతారు. మంచి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక పనులకు సహకరిస్తారు. ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువర్గంతో పనులు నెరవేరినప్పటికీ, వివాదాలు పొడచూపవచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఖర్చులు పెరగవచ్చును. చెల్లింపులలో ఆలస్యం జరుగుతుంది. కొత్త పనులు వాయిదా పడతాయి. ఆత్మీయులతో స్నేహంగా ఉండటం, వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అధికారుల ఆదరణ పొందుతారు. స్థాన చలన అవకాశం ఉంది. ఆదాయం స్థిరంగా ఉన్నా, ఖర్చుల నియంత్రణ అవసరం.