పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. మంచిస్థాయిలో నిలుస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. బంధుమిత్రుల రాక సంతోషాన్నిస్తుంది. వ్యవసాయదారులకు మంచి సమయం. పాతబాకీలు వసూలు అవుతాయి. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. సూర్యారాధన శుభప్రదం.
అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి.
స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల వల్ల కార్యసిద్ధి ఉంది. ఖర్చులు పెరగవచ్చు. నలుగురికీ సాయం అందిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వారం. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు వస్తాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.
కొత్త వ్యాపారం మొదలుపెట్టడంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాయం అందిస్తారు. దీర్ఘకాలిక పనుల విషయంలో ఆటంకాలు రావచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. బంధువర్గం సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులు పెరగవచ్చు. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాలు పఠించండి.
ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. భూ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సద్వినియోగం చేసుకుంటే ఈ వారం అన్ని విధాలుగా లాభాన్ని పొందుతారు. పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. శివాలయాన్ని సందర్శించండి.
దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణ బాధలు పెరగవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఓపికతో పనులను పూర్తిచేసుకోవడం మంచిది. స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విందులకు హాజరవుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఆర్థికపరమైన చికాకులు ఎదురుకావచ్చు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు చేయడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ సమస్యలు తీరుతాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అప్పగించిన బాధ్యతలను సంయమనంతో నిర్వర్తిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృథా ఖర్చులు ఉంటాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ కాలం. కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయాలు సందర్శిస్తారు. ఇష్టదేవతార్చన మేలు చేస్తుంది.
ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. రోజువారీ వ్యాపారం కలిసివస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. భూ వ్యవహారంలో ఆటంకాలు ఎదురవుతాయి. పనిభారం పెరగడంతో అలసటకు గురవుతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శివారాధన శుభప్రదం.
ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగార్థులకు మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలను చేపడతారు. బంధుమిత్రుల సహాయంతో కార్యసాఫల్యం ఉంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సాహిత్య సభలకు హాజరవుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వృథా ఖర్చులు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in