Weekly Horoscope | మేషం
సమయం అనుకూలంగా మారుతుంది. మంచివ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఫలితాల్లో ఆలస్యం ఉండొచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదృష్టం కలిసివస్తుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థికంగా అనుకూలం. మొండి బకాయీలు వసూలు అవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. సోదరులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. పెద్దల సూచనలు పాటించడం మేలు. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన మంచి చేస్తుంది.
శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. రాబడికి తగ్గ ఖర్చులు ముందుకొస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశీ విద్య యత్నాలు ముందుకు సాగుతాయి. దుస్తులు, ఫ్యాన్సీ రంగంలో ఉన్న వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. విందు, వినోదాలకు హాజరవుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయ దర్శనం శుభప్రదం.
గ్రహస్థితి మిశ్రమం. కొన్ని ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వారం మొదట్లో శ్రమ అధికం. వారాంతానికి అన్నీ సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు చికాకులు ఎదురవుతాయి. భాగస్వాములతో విభేదాలు రావొచ్చు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల అనాదరణకు గురవుతారు. వారాంతంలో పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. గణపతి ఆరాధన మంచిది.
ఈ వారం అష్టమ శని ప్రభావం కాస్త తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. రాబడి పెరుగుతుంది. ఖర్చులూ ఉంటాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉపాధ్యాయ, వైద్య, న్యాయవాద వృత్తిలో ఉన్నవారు సంతృప్తికరంగా ఉంటారు. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
వారం మధ్యలో కొన్ని ఇబ్బందులున్నా.. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం. కొత్త స్నేహితుల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం. సకాలంలో డబ్బు అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వృథా చర్చలకు దూరంగా ఉండాలి. పెద్దల సూచనలు పాటించడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు వేగంగాసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి.
స్నేహితులు, బంధువులతో సఖ్యత పెరుగుతుంది. వాహనాల వల్ల కార్యసిద్ధి ఉంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్నవారికి మంచి సమయం. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. రోజువారీ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం మంచిది.
వారం ప్రారంభంలో ఇబ్బందులు ఉంటాయి. తర్వాత అనుకూల సమయం ఉంది. ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. రాజకీయ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. కోర్టు పనులు కలిసి వస్తాయి. సమయానికి డబ్బు అందకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వారాంతంలో ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
అన్ని విషయాల్లో సహనం అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులతో మనస్పర్ధలు రావచ్చు. రోజువారీ కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
వ్యాపారస్తులకు కలిసివస్తుంది. భాగస్వాములతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ, ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. శ్రమకు మించిన ఫలితాలు అందుతాయి. వారాంతంలో శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. మంచివ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పనిభారం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వారం మధ్య నుంచి మార్పు ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉత్సాహంగా ఉంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. నిర్మాణ రంగంలో ఉన్నవారికి కలిసివస్తుంది. రామాలయాన్ని సందర్శించండి.
ఉత్సాహంతో పనులు చేస్తారు. పనిభారంతో అలసట పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలతో ఖర్చులు పెరుగుతాయి. సంతృప్తిగా ఉంటారు. అనుకోని ఖర్చులు ముందుకొస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందించుకునే ఆలోచన చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన మేలు చేస్తుంది.
గృహ నిర్మాణం చేపడతారు. తొందరపాటు నిర్ణయాలతో పనులలో జాప్యం ఉండవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాదాల జోలికి వెళ్లకుండా సంయమనంతో ఉండటం అవసరం. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in