ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా, మంచి పేరు పొందుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంటా, బయటా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శివారాధన శుభప్రదం.
అనుకున్న పనులు పూర్తవుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. రాజకీయ, కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. సూర్యారాధన మేలు చేస్తుంది.
రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఖర్చుల నియంత్రణపై దృష్టి పెట్టండి. వారాంతంలో శుభవార్త వింటారు. హనుమాన్ చాలీసా పఠించండి.
ఉద్యోగులకు శుభ సమయం. పై అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతి, సంఘంలో గౌరవం పెరుగుతాయి. రుణ బాధలు తొలిగిపోతాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. నిరంతర శ్రమతో సత్ఫలితాలు సాధిస్తారు. గురు అనుగ్రహం లభిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. వ్యాపార విస్తరణ చేయు ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రామాలయాన్ని దర్శించుకోండి.
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. అయితే ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు న్యాయపరమైన ఇక్కట్లు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధనతో మేలు జరుగుతుంది.
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొన్ని విషయాల్లో సంయమనం పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
కుంభం: ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. సాహితీవేత్తలకు, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రామాలయాన్ని
దర్శించుకోండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in