వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. సంయమనం పాటించండి. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టి, కార్యనిర్వహణపై మనసు నిలపండి. పెద్దల సహకారం లభిస్తుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఇంటా, బయటా అనుకూల వాతావరణం. రావలసిన డబ్బు ఆలస్యంగా అందినప్పటికీ అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు కొంతవరకు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. కొత్త ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు. శివారాధన శుభప్రదం.
ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరిగినా.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. గతంలో కన్నా ఈ వారం బాగుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా, ఆఖరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దుర్గాదేవి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గురు గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టడం అవసరం. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కావలసిన వస్తువులను కొంటారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రామాలయాన్ని సందర్శించండి.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలం. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థలలో అవకాశాలు వస్తాయి. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో స్థానచలన సూచన ఉంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.
ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చేస్తున్న వృత్తి, సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.
బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులపై మనసు నిలుపుతారు. ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. శివారాధన శుభప్రదం.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువులు, స్నేహితుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన అవకాశం. రావలసిన డబ్బు చివరి నిమిషంలో చేతికి అందుతుంది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.
వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకురావచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
– గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in