ఆస్తుల పంపకాలు పరిష్కారం అవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.
పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.
అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. రామాలయాన్ని సందర్శించండి.
స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల వల్ల కార్యసిద్ధి ఉంది. నలుగురికీ సాయం అందిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వారం. మీ ప్రతిభను నిరూపించుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
కొత్త వ్యాపారం మొదలుపెట్టడంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాయం అందిస్తారు. దీర్ఘకాలిక పనుల విషయంలో ఆటంకాలు రావచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించండి.
ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. భూ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సద్వినియోగం చేసుకుంటే ఈ వారం అన్ని విధాలుగా లాభాన్ని పొందుతారు. శివారాధన శుభప్రదం.
దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఓపికతో పనులను పూర్తిచేసుకోవడం మంచిది. స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి.
భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. నలుగురికీ సాయపడతారు. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ సమస్యలు తీరుతాయి. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. అలసట లేకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అప్పగించిన బాధ్యతలను సంయమనంతో నిర్వర్తిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృథా ఖర్చులు ఉంటాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లక్ష్మీధ్యానం మేలు చేస్తుంది.
ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. రోజువారీ వ్యాపారం కలిసివస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. భూ వ్యవహారంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఓపిక అవసరం. హనుమాన్ చాలీసా పఠించండి.
ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగార్థులకు మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కార్యసాఫల్యం ఉంది. లలితాదేవి స్తోత్రాలు వినండి.
బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. సాహిత్య సభలకు హాజరవుతారు. పలుకుబడి పెరుగుతుంది. వృథా ఖర్చులు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in