ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. పదోన్నతి, అనుకూల బదిలీకి అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ప్రయాణాల వల్ల కలిసివస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు.
పనుల్లో శ్రమ అధికం అవుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. వృథా ఖర్చులు ఉంటాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడి అధికమవుతుంది. ఓర్పుతో అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం.
రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. వాహన మరమ్మతుల కారణంగా ధనవ్యయం అవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అధికారులతో స్నేహంగా ఉండటం అవసరం. ఊహించని ఖర్చులు ముందుకురావొచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త పనుల జోలికి వెళ్లకుండా, చేతిలో ఉన్న పనులను పూర్తిచేయడంపై దృష్టిపెట్టండి.
ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నదమ్ములు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. వాహనం, భూమి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ప్రభుత్వ, రాజకీయ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ములు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలను సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం.
రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆభరణాలు వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. ఉత్పత్తి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. అదృష్టం కలిసివస్తుంది.
ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అందరి సహకారంతో నెరవేరుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పట్టుదలతో పనిచేయడం అవసరం. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపారులకు మిశ్రమ వారం. భాగస్వాములతో మాటపట్టింపులు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
న్యాయ సమస్యలు తీరుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురికి సాయపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. భూ వ్యవహారం లాభిస్తుంది. సంయమనం
అవసరం. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు.
పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. న్యాయ సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. భూ వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. కావలసిన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ప్రశాంతంగా ఉండటానికి ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఉంటుంది.
పనితనానికి గుర్తింపు లభిస్తుంది. రోజువారీ పనులు కలిసివస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భూ లావాదేవీల్లో కాలయాపన ఉండవచ్చు. కుటుంబసభ్యులతో కలిసి విందులు, వినోదాలకు హాజరవుతారు.
సమయ పాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రయాణాలు కలిసివస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలను చేపడతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ, ప్రభుత్వ పనుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. కుటుంబసభ్యుల సహకారంతో లక్ష్యాలు నెరవేరుతాయి.
ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. వృథా ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహం పెరుగుతుంది. ఆత్మీయులు, అనుభవజ్ఞుల సహకారంతో పనులు పూర్తవుతాయి.