Ugadi Panchangam 2022 | కన్య రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
కన్య
ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆదాయం: 11 వ్యయం: 5
రాజపూజ్యం: 4 అవమానం: 5
చైత్రం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
వైశాఖం: ప్రారంభించిన పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తిచేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. నలుగురికి సాయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు.
జ్యేష్ఠం: ఆత్మీయులు, మిత్రుల సహకారం లభిస్తుంది. అయితే కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. శ్రద్ధతో పనులు చేయాలి. ఉద్యోగులకు తోటివారితో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పొందుతారు.
ఆషాఢం: వ్యాపారులు కొత్త లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. రావలసిన డబ్బు వస్తుంది.
శ్రావణం: వివాదాలకు దూరంగా ఉండండి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
భాద్రపదం: పనుల్లో ఆటంకాలు ఏర్పడినా సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.
ఆశ్వయుజం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందుతారు. పూర్వం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
కార్తికం: అనవసరమైన ప్రయాణాల వలన అలసట, వృథా ఖర్చులు ఉంటాయి. పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఫలవంతంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమించి, ఫలితాలను పొందుతారు. బంధువర్గం, స్నేహితులతో పనులు నెరవేరిననూ, జాగ్రత్త అవసరం.
మార్గశిరం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పనిభారం పెరగడంతో అకాల భోజనం చేయాల్సి వస్తుంది. ఫలితంగా అనారోగ్య సూచన. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. వివాహాది శుభ కార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిర్మాణ పనులు చేపడతారు.
పుష్యం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో పనులు కలిసి వస్తాయి. వాహన, భూ లావాదేవీలు అనుకూలం. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంయమనంతో పనులు సాధిస్తారు.
మాఘం: నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు పనిచేసే చోట ఆదరణ పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు
ఫాల్గుణం: గతంలో నిలిచిపోయిన పనులు ప్రారంభిస్తారు. ప్రయాణాల మూలంగా అలసట, వృథా ఖర్చులు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
* ఈ రాశివారికి సప్తమ గురువు శుభాలిస్తాడు. ఐదింట శని, అష్టమ రాహువు, ద్వితీయ కేతువు ప్రతికూల ఫలితాలిస్తారు. శని, రాహువు, కేతువు ప్రీత్యర్థమై జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. శివారాధన, దుర్గాదేవి పూజ, నరసింహ సేవ వల్ల మేలు జరుగుతుంది.
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

