విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం: 14 వ్యయం: 14
రాజపూజ్యం: 3 అవమానం: 1
చైత్రం: పట్టుదలతో పనిచేయడం అవసరం. ఖర్చులను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు.
వైశాఖం: అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రుణ భారం పెరుగుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూల సమయం.
జ్యేష్ఠం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నెలాఖరులో ఇంట్లో అనవసరమైన చర్చలతో వివాదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
ఆషాఢం: పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా మసలుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి.
శ్రావణం: విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యకు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. పనులు అనుకున్న సమయంలో పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలపై దృష్టి నిలుపుతారు.
భాద్రపదం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం మూలంగా మనశ్శాంతి లోపించవచ్చు. వ్యాపారులు సమయానుకూల పెట్టుబడులతో లాభాలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి.
ఆశ్వయుజం:ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపడం అవసరం. విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తే మంచి ఫలితాలను పొందుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి.
కార్తికం: ఆదాయం పెరగడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. రుణబాధల నుంచి విముక్తులు అవుతారు.
మార్గశిరం: సమయానుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి.
పుష్యం: ఈ మాసంలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను నియంత్రించడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.
మాఘం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు.
ఫాల్గుణం: ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. విదేశీ ప్రయాణాలకు, పై చదువులకు అనుకూలం. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
* ఈ రాశివారికి ఐదింట గురువు యోగిస్తాడు, ఆరింట రాహువు శుభ ఫలితాలు ఇస్తాడు. అర్ధాష్టమ శని, పన్నెండింట రాహువు వల్ల చికాకులు ఉంటాయి. శని, రాహువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. రుద్రాభిషేకం చేయించండి. శివారాధన, దుర్గాదేవి పూజ వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..