Ugadi Panchangam 2022 | ధనుస్సు రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం: 2 వ్యయం: 8
రాజపూజ్యం: 6 అవమానం: 1
చైత్రం: ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఏకాగ్రత, సాహసం అవసరం. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి.
వైశాఖం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
జ్యేష్ఠం: ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వర్తించాలి.
ఆషాఢం: రాబడి పెరుగుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు.
శ్రావణం: కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో మనశ్శాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కళాకారులకు ఈ నెల అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
భాద్రపదం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అయితే కొత్త పరిచయస్థులతో జాగ్రత్త అవసరం. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది.
ఆశ్వయుజం: ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం స్థిరంగా ఉండటంతో సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
కార్తికం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. అనాలోచిత నిర్ణయాలతో కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మార్గశిరం: దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.
పుష్యం: ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. భార్యాపిల్లలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ఒప్పందాల విషయంలో సంయమనంతో వ్యవహరించండి.
మాఘం: బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీయాన యోగం.
ఫాల్గుణం: ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన చర్చల మూలంగా మనశ్శాంతి కరువవుతుంది. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించాలి. భూ లావాదేవీల్లో జాప్యం జరగవచ్చు.
* ఈ రాశివారికి చతుర్థంలో గురువు, రెండింట శని, ఐదింట రాహువు సంచారం ప్రతికూలం. పదకొండో స్థానంలో కేతువు అనుకూలిస్తాడు. గురువు, శని, రాహువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించాలి. పరమేశ్వరుడు, దత్తాత్రేయస్వామి, దుర్గాదేవి ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది.
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

