Ugadi Panchangam 2022 | మీన రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం: 2 వ్యయం: 8
రాజపూజ్యం: 1 అవమానం: 7
చైత్రం: ఆదాయం పెరుగుతుంది. నెల చివర్లో బంధువులతోఅభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో పనిచేయండి.
వైశాఖం: వివాదాలలోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం మంచిది. మానసిక సంఘర్షణకు గురవుతారు. ఉద్యోగం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు అవాంతరాలతో పూర్తవుతాయి.
జ్యేష్ఠం: రాబడి అస్థిరంగా ఉన్నప్పటికీ, ఏదో రకంగా డబ్బు సమకూరుతుంది. సహోద్యోగులు, అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలతో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.
ఆషాఢం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన ప్రయాణాల వల్ల అలసట, వృథా ఖర్చులు ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి.
శ్రావణం: ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తిలో పనిభారం పెరిగిననూ, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సంయమనంతో ఆలోచించండి.
భాద్రపదం: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల చదువు కోసం మంచి నిర్ణయాలను తీసుకుంటారు. విదేశీ ప్రయాణాల విషయంలో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ప్రణాళికతో ముందుకు వెళ్తే అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
ఆశ్వయుజం: సంయమనంతో ఉండటం అవసరం. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరగవచ్చు.
కార్తికం: ప్రణాళికతో పనులను చేస్తారు. స్వశక్తితో విజయం సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వాహనాలు, భూములు, ఆస్తుల విషయంలో అప్రమత్తత అవసరం. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం రావచ్చు.
మార్గశిరం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూల సమయం. మంచి సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది.
పుష్యం: అనుకున్న పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉద్యోగులకు పరపతి పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల రాకతో ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది.
మాఘం: ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రద్ధ కనబరిస్తే మంచి ఫలితాలను పొందుతారు. పై చదువులకు అనుకూలం. ఉత్సాహంతో ఉంటారు.
ఫాల్గుణం: ప్రారంభించిన పనులలో ఆటంకాలు, శ్రమాధికం అయినప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. శుభకార్యాలు చేస్తారు.
* ఈ రాశివారికి శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. సంవత్సరం మధ్యలో ఏల్నాటి శని ప్రభావం కొన్ని నెలలు ఉంటుంది. జన్మ స్థానంలో గురువు, ద్వితీయంలో రాహువు, అష్టమ కేతువు వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. గురువు, శని, రాహువు, కేతువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు, రుద్రాభిషేకం చేయించండి. పరమేశ్వరుడు, దుర్గ, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

