Ugadi Panchangam 2022 | మకర రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
మకరం
ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 2
రాజపూజ్యం: 2 అవమానం: 4
చైత్రం: ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించి, సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు పనిచేసే చోట అధికారులతో గౌరవభావంతో మెలుగుతారు.
వైశాఖం: అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తారు. సహోద్యోగులతో సంబంధాలు పెంపొందుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
జ్యేష్ఠం: ప్రారంభించిన పనులు మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ, తర్వాత అనుకూలంగా పూర్తవుతాయి. బంధువులు, స్నేహితుల వలన కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో మనస్పర్ధలు రావచ్చు.
ఆషాఢం: కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో కీర్తి ప్రతిష్ఠలు, గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
శ్రావణం: ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనవసర చర్చల వల్ల మనశ్శాంతి కొరవడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రాబడి పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు.
భాద్రపదం: ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతోషంతో పనులు చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. ప్రయాణాల కారణంగా అలసట పెరగవచ్చు. వివాదాలకు దూరంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి.
ఆశ్వయుజం: కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. సమయ పాలనతో సత్ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
కార్తికం: స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో ముందుకు వెళతారు.
మార్గశిరం: కుటుంబంలో అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలను తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం.
పుష్యం: ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంఘంలో సత్కీర్తి పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. నలుగురికి సాయపడతారు.
మాఘం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పట్టుదలతో ఫలితాలు సాధిస్తారు.
ఫాల్గుణం: శ్రమకు తగిన ఫలితం పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల అలసట, అనారోగ్య సూచన. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది.
* ఈ రాశివారికి మూడింట గురువు శుభ ఫలితాలు ఇస్తాడు. ఏల్నాటి శని ప్రభావం ఉంది. అర్ధాష్టమ రాహువు, దశమంలో కేతువు సంచారం ప్రతికూలం. శని, రాహువు, కేతువు ప్రీత్యర్థం జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు, రుద్రాభిషేకం చేయించండి. పరమేశ్వరుడు, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

