Ugadi Panchangam 2022 | కర్కాటక రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 5 వ్యయం: 5
రాజపూజ్యం: 5 అవమానం: 2
చైత్రం: ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పై అధికారుల మన్ననలు అందుకుంటారు. సంకల్పం బలంతో ముందుకు వెళ్తారు. సంయమనంతో వ్యవహరిస్తే విజయం మీదే.
వైశాఖం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అన్ని విషయాల్లో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి.
జ్యేష్ఠం: పనులు మొదట్లో మందకొడిగా సాగినా, సకాలంలో పూర్తవుతాయి. పట్టువిడుపులతో ప్రయోజనం పొందుతారు. ఆర్థికస్థితి స్థిరంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి.
ఆషాఢం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. భూములు, వాహనాల మూలంగా పనులు నెరవేరుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నెలాఖరులో అభీష్ట సిద్ధి.
శ్రావణం: ఈ నెలలోనూ అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది.
భాద్రపదం: మొదలుపెట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉంటారు.
ఆశ్వయుజం: ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పనుల్లో జాప్యం ఉండదు. మాసాంతంలో ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది.
కార్తికం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలు గడిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వాహనాలు, భూముల విషయంలో ఖర్చులు ఉంటాయి.
మార్గశిరం: ఉద్యోగులకు అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో ఉత్సాహంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు అనుకూలం.
పుష్యం: ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరినప్పటికీ, ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
మాఘం: అనవసరమైన ఆలోచనలతో ఒత్తిడికి గురవుతారు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కొత్త ఒప్పందాలను వాయిదా వేసుకోవడం మంచిది.
ఫాల్గుణం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యస్థలంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
* ఈ రాశివారికి భాగ్య గురువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. సప్తమ, అష్టమ స్థానాల్లో శని, దశమంలో రాహువు, చతుర్థ కేతువు వల్ల సమస్యలు కలుగుతాయి. శని, రాహువు, కేతువు ప్రీత్యర్థమై జప, క్షీర తర్పణ, హోమ, దానాదులు చేయించండి. శివారాధన, దుర్గాదేవి పూజ, నరసింహస్వామి సేవతో మేలు కలుగుతుంది..
Read More :
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది?
Panchangam 2022 | కొత్త సంవత్సరంలో పెండ్లిళ్లకు శుభ ముహూర్తాలు ఇవే..
Panchangam 2022 | తారాబలం ఎలా చూడాలంటే..
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
Ugadi 2022 | ఈ కొత్త సంవత్సరంలో వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయంటే..
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

