Numerology | ప్రతి వ్యక్తికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నట్లే.. కొన్నిసార్లు సంబంధాలను దెబ్బతీసే బలహీనతలు కూడా ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం.. పుట్టిన తేదీ ఆధారంగా నిర్ణయించే మూలాంకం సాయంతో అవేంటో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, ప్రవర్తనతో పాటు అతని బలాలు, బలహీనతలు, సంబంధాల్లో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయొచ్చని అంటున్నారు. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌ను పాడు చేసే‘రెడ్ ఫ్లాగ్‘ ను కూడా మూలాంకాన్ని బట్టి కనిపెట్టవచ్చని చెబుతున్నారు.
ఏ నెలలోనైనా 1, 10, 19, 28వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 1గా పరిగణిస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, నిజాయితీ, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో తామే ముందుండాలని భావించడం, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం వీరి ప్రధాన ‘రెడ్ ఫ్లాగ్‘గా నిపుణులు చెబుతున్నారు.
ఏ నెలలోనైనా 2, 11, 20, 29వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 2గా పరిగనిస్తారు. వీరు భావోద్వేగపరులుగా ఉంటారు. చిన్న విషయాలను కూడా మనసులో పెట్టుకోవడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల రిలేషన్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏ నెలలోనైనా 2, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 3గా పరిగణిస్తారు. వీరిలో ఆత్మ గౌరవం, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. అయితే తమ అభిప్రాయమే సరైనదని నిరూపించేందుకు ప్రయత్నించడం, ఇతరులను నియంత్రించాలనే ధోరణితో ఉండటం వల్ల ఎదుటివారు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా భావించవచ్చు. దీనివల్ల రిలేషన్షిప్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఏ నెలలోనైనా 4, 13, 22, 31వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 4గా పరిగణిస్తారు. వీరు సాధారణంగా ధైర్యసాహసాలను కలిగి ఉంటారు. అయితే మొండితనం, తిరుగుబాటు స్వభావం వీరిలో ప్రధానంగా రెడ్ఫ్లాగ్గా చెబుతారు. వీటి కారణంగా అనవసర వివాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉంది.
ఏ నెలలోనైనా 5, 14, 23వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 5గా పరిగణిస్తారు. వీరిలో సాహసం, తెలివితేటలు, కొత్త విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక నిర్ణయంపై ఎక్కువకాలం స్థిరంగా నిలబడలేరు. కమిట్మెంట్ విషయంలో కూడా స్థిరత్వం ఉండదు. దీనికారణంగా రిలేషన్షిప్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏ నెలలోనైనా 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా ఉంటుంది. వీరు ప్రేమ, అందం, కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఎదుటివారి నుంచి చాలా అధికంగా అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశ, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది.
ఏ నెలలోనైనా 7, 16, 25వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 7గా ఉంటుంది. స్వతంత్ర ఆలోచనలు, ప్రత్యేక వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. అయితే తమ భావాలను ఇతరులతో పంచుకోకుండా ఉండటం, ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడటం వంటి లక్షణాల వల్ల వీరిని ఇతరులు అర్థం చేసుకోలేరు.
ఏ నెలలోనైనా 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8గా పరిగణిస్తారు. గంభీరత, క్రమశిక్షణ, సహనం వీరి ప్రత్యేకతలుగా నిపుణులు చెబుతుంటారు. అయితే వీరు కోపాన్ని దాచుకోలేరు. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం, భావోద్వేగాలకు లోనై నిర్ణయాలను తీసుకుంటుంటారు. అలా తీసుకున్న నిర్ణయాల వల్ల చివరకు బాధపడాల్సి వస్తుంది.
ఏ నెలలోనైనా 9, 18, 27వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 9గా పరిగణిస్తారు. వీరిలో ఉత్సాహం, శక్తి, క్రమశిక్షణ ఎక్కువగా ఉంటాయి. అయితే పనులు, లక్ష్యాలపై ఎక్కువగా దృష్టిపెట్టడం వల్ల సంబంధాలకు తగిన సమయం కేటాయించకపోవడాన్ని వీరిలో ప్రధాన రెడ్ఫ్లాగ్గా చెబుతారు.
Numerology | వీళ్లు యాటిట్యూడ్‌లో కింగ్.. అయినా సక్సెస్ కోసం గొడ్డులా కష్టపడతారు..!