24-05-2022 మంగళవారం.. మీ రాశిఫలాలు
మేషం : వృథా ప్రయాణాలెక్కువగా ఉంటాయి. స్త్రీలమూలకంగా ధనలాభముంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశంముంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు.
వృషభం : ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు. ప్రయాణాలెక్కువ చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే ఆందోళన చెందుదురు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.
మిథునం : తరచూ ప్రయాణాలెక్కువ చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
కర్కాటకం : కొన్నికార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి.
సింహం : శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమజాంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుదురు.
కన్య : విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి.
తుల : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆత్మీయుల సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
వృశ్చికం : గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. అనారోగ్యం బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు.
ధనస్సు : తలచిన కార్యాలన్నియు విజయవంతం పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మనన్నలను పొందుతారు. అనారోగ్యబాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులేర్పడుతాయి.
మకరం : స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపారమూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలయందు అనాసక్తితో ఉంటారు.
కుంభం : ప్రయత్నాకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
మీనం : రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలేర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
– పంచాంగకర్త
గౌరీభట్ల రామకృష్ణ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
94403 50868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

