Horoscope | 10-05-2025 శనివారం.. మీ రాశి ఫలాలు
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
ప్రయత్నకార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడుతారు.
వృషభం
బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులుండును. కొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుదురు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మిథునం
వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
కర్కాటకం
ఆకస్మిక ధనలాభముంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
సింహం
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడుతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు.
కన్య
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
తుల
నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండుట మంచిది. అనవసర భయాందోళనకు లోనవుతారు.
వృశ్చికం
మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
ధనుస్సు
ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
మకరం
కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండుట మంచిది. అందరితో స్నేహంగా ఉండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
కుంభం
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుదురు.
మీనం
స్త్రీల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబమంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

