30-01-2022 ఆదివారం.. మీ రాశి ఫలాలు
Horoscope | ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.

మేషం: మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
వృషభం: ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.
మిథునం: స్థిరాస్తులకు సంబంధిచిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.
కర్కాటకం: పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.
సింహం: నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.
కన్య: తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
తుల: ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
వృశ్చికం: కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిరనివాసం ఉంటుంది. వ్యవసాయం వల్ల లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
ధనుస్సు: సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
మకరం: ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రసాయల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.
కుంభం: ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధవహించక తప్పదు.
మీనం: రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

