Horoscope | 29-12-2024 ఆదివారం.. నేటి రాశి ఫలాలు
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
వృషభం
ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.
మిథునం
వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.
కర్కాటకం
ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.
సింహం
ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
కన్య
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
తుల
ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.
వృశ్చికం
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
ధనుస్సు
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.
మకరం
నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
కుంభం
అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.
మీనం
అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభిచకూడదు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

